Nirmal: నిర్మల్: కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్ రూమ్, అత్యవసర నంబర్లు!

Nirmal: నిర్మల్: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా. అత్యవసర సాయం కోసం 9100577132 సంప్రదించండి.

RAKESH N, KHANAPUR
Published on: 30 July 2026 2:15 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్: కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్ రూమ్, అత్యవసర నంబర్లు!

భారీ వర్షాలపై కలెక్టరేట్ లో ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు:

నిర్మల్ జిల్లా// భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

జిల్లా ప్రజలకు భారీ వర్షాలు, వరదల కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 9100577132 ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. 24 గంటల పాటూ కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల నుంచి వచ్చే కాల్స్ స్వీకరిస్తారని వివరించారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఎవరికైనా ఇబ్బందులు కలిగినట్లయితే పై కంట్రోల్ రూమ్ నంబరునకు సంప్రదించి సహాయం పొందవచ్చునని కలెక్టర్ తెలిపారు........

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story