Nirmal: కరెంట్ కోతలపై బీఆర్‌ఎస్ భగ్గు.. సబ్‌స్టేషన్ ముట్టడి!

Nirmal: నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో అప్రకటిత కరెంట్ కోతలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 10 Sept 2026 6:48 PM IST
Nirmal
X

Nirmal: కరెంట్ కోతలపై బీఆర్‌ఎస్ భగ్గు.. సబ్‌స్టేషన్ ముట్టడి!

నిర్మల్ జిల్లా: లోకేశ్వరం మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి లోకేశ్వరం విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించి ఆందోళనకు చేపట్టారు. ముధోల్ నియోజకవర్గ సమన్వయ నాయకులు లోలం శ్యాం సుందర్ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

విద్యుత్ కోతలపై ఏఈ శివకుమార్‌ను నిలదీశారు.ఈ సందర్భంగా శ్యాం సుందర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని అన్నారు.ప్రస్తుతం అప్రకటిత కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలు సాగు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కోతలను తక్షణమే నిలిపివేసి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు లేకపోతే రైతులను పెద్ద సంఖ్యలో సమీకరించి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story