Nirmal: నిర్మల్ జిల్లాలో పోలీస్ సిబ్బందికి ఘనంగా వీక్లీ పరేడ్!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీసులకు సబ్‌డివిజన్లు, సర్కిళ్ల వారీగా వీక్లీ పరేడ్. విధినిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని డీఎస్పీ శ్రీనివాస్ వ్యాఖ్య.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 29 Aug 2026 12:12 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో పోలీస్ సిబ్బందికి ఘనంగా వీక్లీ పరేడ్!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ సబ్‌డివిజన్లు, సర్కిల్ పరిధుల్లోని పోలీస్ సిబ్బందికి ఉదయం వీక్లీ పరేడ్ నిర్వహించారు. నిర్ణీత సమయానికి సిబ్బంది బేస్‌లైన్ ఫాలిన్‌లో పాల్గొని, అనంతరం పరేడ్ నిర్వహించారు. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్, నిర్మల్ రూరల్ సర్కిల్, సోన్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో వీక్లీ పరేడ్ నిర్వహించారు.

డీఎస్పీ శ్రీనివాస్ పరేడ్‌ను నిర్వహించగా, సీఐ కృష్ణ, సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి భైంసా టౌన్ పోలీస్ స్టేషన్‌లో వీక్లీ పరేడ్ నిర్వహించారు. భైంసా లో రవీందర్ సీఐ పరేడ్‌ను నిర్వహించి సిబ్బంది ప్రదర్శించిన డ్రిల్‌ను పరిశీలించారు.

ఖానాపూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో వీక్లీ పరేడ్ నిర్వహించారు. సీఐ సత్యనారాయణ పరేడ్‌ను నిర్వహించగా, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వీక్లీ పరేడ్ ద్వారా పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, సమన్వయం పెంపొందుతాయని తెలిపారు.

విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విధుల మధ్య సమయం దొరికినప్పుడల్లా వ్యాయామం చేయడం, ఫిట్నెస్‌ను నిరంతరం కాపాడుకోవడం ద్వారా మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చన్నారు.

పోలీసులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా వ్యక్తిగత, ఆరోగ్య లేదా విధులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని అధికారులు సూచించారు. ఈ వీక్లీ పరేడ్‌లో AR, DCRB, IT Core, SB, PCR, SHE Team, Bharosa తదితర విభాగాల సిబ్బంది కూడా పాల్గొని పరేడ్, డ్రిల్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story