Nirmal: 22A భూదోపిడీపై మహా దీక్ష.. బీజేఎల్పీ నేత పిలుపు!
Nirmal: 22A నిషేధిత భూముల అక్రమాలపై సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో మహా దీక్ష.
Nirmal: 22A భూదోపిడీపై మహా దీక్ష.. బీజేఎల్పీ నేత పిలుపు!
Nirmal: రాష్ట్రంలో 22A (నిషేధిత భూముల జాబితా) ముసుగులో ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలను నిరసిస్తూ సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తలపెట్టిన రెండు రోజుల మహా దీక్షను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ దీక్ష సన్నద్ధతపై నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షతన ఈరోజు నిర్మల్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న ఈ మహా దీక్షకు తరలిరావాల్సిన శ్రేణుల సమన్వయంపై నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భూ బదిలీలు, ఆస్తుల బదలాయింపు పేరుతో సాగుతున్న కుంభకోణాలపై ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టేందుకే ఈ మహా దీక్షను చేపట్టామని స్పష్టం చేశారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసేందుకు బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ భూముల నిబంధనలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకునే వరకు ఈ ప్రజా ఉద్యమం కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు.
ఈ సమావేశంలో సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, మేడిశెమ్మే రాజు, ఆకుల శ్రీనివాస్,జనరల్ సెక్రటరీలు రవీందర్ రెడ్డి, కరిపే విలాస్, అంకం మహేందర్, నిర్మల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ లు, సర్పంచ్లు బీజేవైఎం నాయకులు స్థానిక బీజేపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




