Nirmal: బాధిత కుటుంబాలకు ఎల్ఓసీ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి!

Nirmal: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి LOC చెక్కులు అందజేశారు. మహేశ్వర్ రెడ్డికి బాధిత కుటుంబాల కృతజ్ఞతలు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 31 Aug 2026 1:14 PM IST
Nirmal
X

Nirmal: బాధిత కుటుంబాలకు ఎల్ఓసీ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి!

Nirmal: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరైన LOC చెక్కులను నిర్మల్ లోని ఆయన నివాస గృహంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.

సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన గుమ్ముల నర్సింహులు కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం రూ.2 లక్షల LOC చెక్కును అందజేశారు. అదేవిధంగా నిర్మల్ పట్టణంలోని నాయిడివాడకు చెందిన నామెద గంగామణి కుటుంబానికి వైద్య చికిత్స నిమిత్తం రూ 75 వేల LOC చెక్కును అందజేశారు.

ఆపద సమయంలో తమ కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story