Nirmal: శివరాజ్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి!
Nirmal: నిర్మల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శివరాజ్ పటేల్ కుటుంబాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Nirmal: శివరాజ్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి!
Nirmal: దిలావర్‌పూర్ మండలం సముందర్‌పల్లి గ్రామానికి చెందిన శివరాజ్ పటేల్ (25) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శివరాజ్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆపద సమయంలో వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. శివరాజ్ పటేల్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
Next Story




