Nirmal: దస్తురాబాద్‌లో భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతం
Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అంగరంగ వైభవంగా మంగళ గౌరీ వ్రతం నిర్వహించిన మహిళలు. ఆధ్యాత్మిక శోభతో ఆలయం.
Nirmal: దస్తురాబాద్‌లో భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతం
నిర్మల్: నిర్మల్ జిల్లాలో శ్రావణ మాస పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.
మంగళవారం సందర్భంగా ఆలయంలో మంగళ గౌరీ వ్రత పూజలను భక్తులు అత్యంత వైభవంగా జరిపారు. మండల కేంద్రానికి చెందిన మహిళలందరూ పెద్ద సంఖ్యలో ఒక్కచోటికి చేరుకుని, సాంప్రదాయ బద్ధంగా ధూప దీప నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేశారు.
ఆలయ అర్చకులు రాజేష్ మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల మహిళలకు సౌభాగ్యం లభిస్తుందని తెలిపారు. ఈ పూజల వల్ల కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మరియు సకల సంపత్తులు కలుగుతాయని ఆయన వివరించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు తీర్థప్రసాదాలు అందజేశారు.




