Nirmal: కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల
Nirmal: నిర్మల్ గాంధీచౌక్ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
Nirmal: కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల
నిర్మల్: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం నిర్మల్ గాంధీచౌక్‌లోని శ్రీ మురళీకృష్ణ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయ అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం రాంరావ్ బాగ్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించినట్లు తెలిపారు.
ధర్మాన్ని, సత్యాన్ని, మంచితనాన్ని ఆచరించాలనే సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితంతో ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.
Next Story




