Dasturabad: వినాయక మండపాల వద్ద విద్యుత్ భద్రతపై ప్రత్యేక అవగాహన

Dasturabad: నిర్మల్ జిల్లాలో వినాయక మండపాల వద్ద విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం. నాణ్యమైన వైర్లు వాడాలని ఏడీఈ శ్రీనివాస్ సూచన.

RAKESH N, KHANAPUR
Published on: 14 Sept 2026 9:41 PM IST
Dasturabad
X

Dasturabad: వినాయక మండపాల వద్ద విద్యుత్ భద్రతపై ప్రత్యేక అవగాహన

దస్తురాబాద్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంతో పాటు బుట్టాపూర్, చెన్నూర్ గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖానాపూర్ విద్యుత్ శాఖ ADE టి. శ్రీనివాస్ మండపాలను సందర్శించి, నిర్వాహకులకు, భక్తులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల పరిధిలోని బుట్టాపూర్, చెన్నూర్ గ్రామాల్లోని గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.

ఖానాపూర్ విద్యుత్ శాఖ ADE టి. శ్రీనివాస్ స్వయంగా మండపాలను పరిశీలించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.మండపాల నిర్వాహకులు నాణ్యమైన వైర్లను మాత్రమే వాడాలని, విద్యుత్ కనెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

వర్షాలు పడే అవకాశం ఉన్నందున వైర్లు ఎక్కడైనా తెగిపోయినా, షార్ట్ సర్క్యూట్ అయినా వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. భక్తులు కూడా లైన్లకు దూరంగా ఉండాలని, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బుట్టాపూర్ సర్పంచ్ జి. నరేష్, స్థానిక విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR