Nirmal: పేర్కపల్లెలో భూ వివాదం మహిళా రైతు పొలంలో పశువులతో విధ్వంసం!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పేర్కపల్లెలో భూ వివాదం. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న మహిళా రైతు పొలంలో నాట్లు, పంట ధ్వంసం. పోలీసుల రంగప్రవేశం.

RAKESH N, KHANAPUR
Published on: 11 Aug 2026 11:13 AM IST
Nirmal
X

Nirmal: పేర్కపల్లెలో భూ వివాదం మహిళా రైతు పొలంలో పశువులతో విధ్వంసం!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పేర్కపల్లె గ్రామంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపైకి ఒక వర్గం వారు వచ్చి దౌర్జన్యానికి దిగారు. పంటను ధ్వంసం చేయడమే కాకుండా, పశువుల మందను పొలంలోకి తోలి తీవ్ర నష్టం తెచ్చారు. బాధితులు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోపు లచ్చవ్వ అనే మహిళా రైతుకు మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఆమె కుటుంబం గత యాభై ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే, తాజాగా గ్రామానికి చెందిన ఒక వర్గం వారు ఈ భూమిపైకి వచ్చారు. గతంలో ఇది పార్వతి లచ్చ గౌడ్‌కు చెందిన భూమి అంటూ గొడవకు దిగారు.అంతటితో ఆగకుండా... లచ్చవ్వ పొలంలో వేసిన నాట్లను, పంటను పూర్తిగా ధ్వంసం చేశారు.

ఆపై కాలనీకి చెందిన బర్ల మందను కావాలనే ఆ పొలంలోకి తోలి మరింత విధ్వంసం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు స్పందించి, సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story