Nirmal: నిర్మల్‌లో వైఎస్సార్ వర్ధంతి.. కూచాడి శ్రీహరిరావు నివాళులు!
Nirmal: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని నిర్మల్ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు అన్నారు. వైఎస్సార్ వర్ధంతి నివాళులు.
Nirmal: నిర్మల్‌లో వైఎస్సార్ వర్ధంతి.. కూచాడి శ్రీహరిరావు నివాళులు!
Nirmal: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు పేర్కొన్నారు. నిర్మల్ లోని కూచాడి శ్రీహరివరావు క్యాంప్ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన తొలి సంతకంతో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు చిన్ను, నిర్మల్ గండి రామన్న ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్, రఫీ, ప్రతాప్ రెడ్డి, పోశెట్టి, శ్రీధర్, నర్సాపూర్(జి) సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి, మధుకర్ రెడ్డి, కాల్వ నర్స రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




