Nirmal: రాహుల్ గాంధీ అరెస్ట్‌పై శ్రీహరి రావు ఆగ్రహం!
Nirmal: నిర్మల్ అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో నిరసన. రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ ఆర్డీవోకు వినతిపత్రం.
Nirmal: రాహుల్ గాంధీ అరెస్ట్‌పై శ్రీహరి రావు ఆగ్రహం!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ మినీ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ఆంధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.నీట్ ఎగ్జామ్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Next Story




