Khanapur: ఖానాపూర్‌లో దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన కలెక్టర్
Khanapur: ఖానాపూర్ మైనారిటీ వసతి గృహ రహదారిని పరిశీలించిన నిర్మల్ కలెక్టర్. నిత్యావసరాలు నిరంతరం అందించాలని ఆదేశం. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం.
Khanapur: ఖానాపూర్‌లో దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన కలెక్టర్
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని హైటెక్ సిటీ మైనారిటీ వసతి గృహానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారిని కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిత్యావసర వస్తువులు,
అవసరమైన సామగ్రిని నిరంతరం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక, నీటిపారుదల శాఖ అధికారులు జగదీష్, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ కుమార్, వీరన్న, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహశీల్దార్లు ఖాజా మొయినుద్దీన్, సుజాత, , ఎంపీడీఓ రాధా రాథోడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




