Lakshmanchanda: అవసరాలను బట్టి ప్రణాళికాబద్ధంగా నీటి వినియోగం కలెక్టర్
Lakshmanchanda: నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం బాబాపూర్ చెరువును పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా. పంటల అవసరాలను బట్టి ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేయాలని సూచన.
Lakshmanchanda: అవసరాలను బట్టి ప్రణాళికాబద్ధంగా నీటి వినియోగం కలెక్టర్
లక్ష్మణచాంద: రైతుల పంటల అవసరాలను, ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా నీటి వినియోగం చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన లక్ష్మణచందా మండలంలోని బాబాపూర్ గ్రామంలో ఉన్న చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెరువులోని నీటి మట్టం, గ్రామంలోని వ్యవసాయ సాగు నీటి అవసరాలను బేరీజు వేసుకొని నీటిని విడుదల చేయాలని సూచించారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి నీరు అందేలా, వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
అనంతరం చెరువు తూము పరిస్థితిని, కట్ట దృఢత్వాన్ని అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడే ఉన్న స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి, చెరువు కింద సాగవుతున్న పంటల రకాలు, మొత్తం ఆయకట్టు విస్తీర్ణం, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ పరిశీలనలో వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




