Nirmal: కాంగ్రెస్ దాడులకు భయపడం బీజేపీ సీనియర్ నేత రావుల రామనాథ్!
Nirmal: తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ భయపడుతోందని రావుల రామనాథ్ విమర్శ. 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్‌లో ఏలేటి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు.
Nirmal: కాంగ్రెస్ దాడులకు భయపడం బీజేపీ సీనియర్ నేత రావుల రామనాథ్!
Nirmal: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 326 సీట్లతో ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారని ఇండియా టుడే–సీ ఓటర్ సర్వే వెల్లడించిందని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్ తెలిపారు.
నిర్మల్ లోని మహేశ్వర్ రెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
తెలంగాణలోనూ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే 9 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడవ్వడం తో తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అందుకే బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తట్టుకోలేక బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. నల్గొండలో బీజేపీ కార్యాలయం, నాయకుల ఇళ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లే.. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలను దాడులు, బెదిరింపులతో భయపెట్టడం సాధ్యం కాదన్నారు. బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు.
అదేవిధంగా 22-A భూముల అక్రమాలు, భూ కబ్జాలు, అటవీ భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జమాల్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తిక్, కౌన్సిలర్ గంజి రాజు, శ్రీరామోజి నరేష్, జింక సురేందర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.




