Nirmal: నిర్మల్ ఆటో డ్రైవర్ అస్లాం హత్య కేసు చేధన ఎస్పీ జానకి

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ అస్లాం హత్య కేసును చేధించిన పోలీసులు. సవతి తల్లితో అక్రమ సంబంధమే కారణమన్న ఎస్పీ జానకి షర్మిల.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 24 July 2026 3:53 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ ఆటో డ్రైవర్ అస్లాం హత్య కేసు చేధన ఎస్పీ జానకి

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన హత్యకు అక్రమ సంబంధమే కారణమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె వెల్లడించారు. పది రోజుల క్రితం నిర్మల్ పట్టణంలో అస్లాం అనే ఆటో నడిపే యువకుడి హత్య జరిగింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి శరవేగంగా హత్య కేసును చేదించినట్లు తెలిపారు. అస్లం అనే యువకుడికి అతని సవతి తల్లి అన్వరి బేగంతో అక్రమ సంబంధం ఉండేదని దర్యాప్తులో తేలిందన్నారు. అక్రమ సంబంధం ఆపేసి తాను వివాహం చేసుకుంటానని అస్లం తెలుపగా ఆగ్రహించిన అన్వరి బేగం అస్లం హత్యకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు.

పరిచయస్తుడైన ముఖిమ్ తో హత్య చేయడం కోసం ఆరు లక్షలకు బేరం కుదుర్చుకొని 50వేల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించారని తెలిపారు. ముఖిమ్ తన స్నేహితులు మరో నలుగురితో జూలై 1న హత్యకు పథకం రచించి విఫలం అయ్యాడని, మరోసారి జూలై 14వ తేదీన అన్వరి బేగం సూచనల మేరకు ఉదయం 5 గంటల సమయంలో కత్తులతో హత్య చేసి.

అనంతరం మహారాష్ట్ర వైపుకు పారిపోయారన్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతికను ఆధారం చేసుకుని కేసును చేదించినట్లు తెలిపారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుండి రెండు కత్తులు, ఒక బైక్, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కేసును చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులు సిబ్బందిని ఆమె అభినందించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story