Nirmal: భైంసా ఆస్పత్రిలో 18 ఏళ్లుగా మారని 'డెవలప్‌మెంట్ కమిటీ' బోర్డు
Nirmal: భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో 18 ఏళ్ల కిందటి డెవలప్‌మెంట్ కమిటీ బోర్డే ఇప్పటికీ దర్శనమిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Nirmal: భైంసా ఆస్పత్రిలో 18 ఏళ్లుగా మారని 'డెవలప్‌మెంట్ కమిటీ' బోర్డు
నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగం హల్లో ‘డెవలప్‌మెంట్ కమిటీ’ బోర్డుపై విమర్శలు వినిపిస్తున్నాయి.ఏళ్లు గడుస్తున్నా..!ప్రభుత్వాలు మారుతున్నా..! ఎమ్మెల్యేలు మారుతున్నా..!భైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఔట్ పేషంట్ విభాగం హల్లో ఓ బోర్డు మాత్రం మారడం లేదు.దాదాపు 18 ఏళ్ల కింద ఛైర్మెన్ గా మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల చారి వున్నా సమయంలో అదే ‘డెవలప్‌మెంట్ కమిటీ’ బోర్డు దర్శనమిస్తోంది.
దీంతో ఆస్పత్రికి వచ్చే ప్రజలు, స్థానికులు ఈ బోర్డును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.గత మూడు పర్యాయాల్లో రెండుసార్లు విట్టల్ రెడ్డి, ఒకసారి ప్రస్తుత ఎమ్మెల్యే రామారావు పటేల్ తాలూకా నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.ప్రజాప్రతినిధులు మారినా,కాలం మారినా..!ఆస్పత్రి అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ అక్కడి హల్లో గోడకు రాసివున్నా బోర్డు మారకపోవడంపై చర్చ జరుగుతోంది.
ఆస్పత్రి అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నప్పటికీ,18 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కమిటీ పేరుతో ఉన్న బోర్డును మార్చడానికి మాత్రం నిధులు లేవా? అంటూ స్థానికులు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రస్తుత డెవలప్‌మెంట్ కమిటీ వివరాలతో ఔట్ పేషంట్ విభాగం హల్లో కొత్త బోర్డు ఏర్పాటు చేస్తారా? లేక ఈ బోర్డుకు మరో పుట్టినరోజు కూడా జరుపుతారా? అన్నది వేచి చూడాలి.




