Gudihathnur: గంజాయి మత్తు నుంచి మార్పు వైపు: ‘నిన్నటి నేను’ షార్ట్‌ఫిలిం ప్రారంభం
Gudihathnur: గంజాయి, డ్రగ్స్ వ్యసనాలపై అవగాహన కల్పించేందుకు గుడిహత్నూర్ మండలంలో 'నిన్నటి నేను' లఘుచిత్రం ప్రారంభమైంది.
Gudihathnur: గంజాయి మత్తు నుంచి మార్పు వైపు: ‘నిన్నటి నేను’ షార్ట్‌ఫిలిం ప్రారంభం
గుడిహత్నూర్: గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో చైతన్యం తీసుకురావడంతో పాటు, మత్తుకు బానిసైన యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న ‘నిన్నటి నేను’ లఘుచిత్ర చిత్రీకరణ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి గుడిహత్నూర్ ఎస్సై ఎల్ శ్రీకాంత్ క్లాప్ కొట్టి షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ కోలా మాట్లాడుతూ, నేటి సమాజంలో ఎంతోమంది యువకులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల ఉచ్చులో పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని మత్తు బారిన నుంచి మార్పు వైపు నడిపించేలా ఈ సందేశాత్మక చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని, సమాజానికి మంచి సందేశం ఇవ్వడంతో పాటు స్థానిక కళాకారులకు సరైన వేదికను అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌తో పాటు ప్రశాంత్ కొండా, బండారి రవీందర్, గనోజి శ్రీనివాస్, మహమూద్, మహేష్, జాదవ్ నవీన్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.




