Nirmal: ఎస్పీ జానకి షర్మిలను కలిసిన పోలీస్ అధికారుల సంఘం!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎస్పీ జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసింది. ఎస్పీ అభినందనలు తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 5 Sept 2026 3:28 PM IST
Nirmal
X

Nirmal: ఎస్పీ జానకి షర్మిలను కలిసిన పోలీస్ అధికారుల సంఘం!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ జానకి షర్మిలను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఎస్పీ అభినందిస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులపై సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, సమన్వయం, సేవాభావాన్ని మరింత బలోపేతం చేయడంలో పోలీస్ అధికారుల సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు.

నూతన కార్యవర్గ సభ్యులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీస్ శాఖ అభివృద్ధి, అధికారుల సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఆర్‌ఐ అమిత్ రామ్, అలాగే నిర్మల్ జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story