Dasturabad: దస్తూరాబాద్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక మోక్ డ్రిల్!
Dasturabad: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ దేవునిగూడెంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణపై అవగాహన సదస్సు.
Dasturabad: దస్తూరాబాద్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక మోక్ డ్రిల్!
Dasturabad: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలోని దేవునిగూడెం గ్రామంలో విపత్తు నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో ఎన్.డి.ఆర్.ఎఫ్ (NDRF) సిబ్బంది గ్రామస్తులకు ప్రత్యక్షంగా వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రాణాలను ఎలా కాపాడాలో అధికారులు ఈ సదస్సులో చేసి చూపించారు. ముఖ్యంగా గుండె ఆగిపోయిన వారికి చేసే సీపీఆర్ (CPR) ప్రక్రియపై గ్రామస్తులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు.
ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను తెలియజేస్తూ.. గ్రామ సమీపంలోని చెరువులు, లోతట్టు ప్రాంతాలను అధికారులు స్వయంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో స్థానికులు ఎలా అప్రమత్తంగా ఉండాలో దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం, తాసిల్దార్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.




