Mancherial: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌కు ఘన సన్మానం

Mancherial: మంచిర్యాలలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను బార్ అసోసియేషన్ సన్మానించింది. జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 15 Sept 2026 7:39 PM IST
Mancherial
X

Mancherial: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌కు ఘన సన్మానం

మంచిర్యాల: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో పర్యటనకు వచ్చిన హుస్సేన్ నాయక్‌ను బార్ అసోసియేషన్‌కు ఆహ్వానించగా, ఆయన ఆహ్వానం మేరకు విచ్చేశారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులు హుస్సేన్ నాయక్‌ను సత్కరించారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదిలాబాద్‌లో ఉండటంతో మంచిర్యాల జిల్లా పరిధిలోని బాధితులు, ఫిర్యాదుదారులు న్యాయపరమైన అవసరాల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల సమయం, ప్రయాణ ఖర్చులు భరించాల్సి వస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలోనే ఎస్సీ, ఎస్టీ కోర్టును ఏర్పాటు చేస్తే ఈ వర్గాలకు మరింత సులభంగా, వేగంగా న్యాయం అందే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు పులి రాయమల్లు, సత్యనారాయణ, మల్లారెడ్డి, మల్లేష్, రవీందర్, కమల మనోహర్, తుల ఆంజనేయులు, మంజుల, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.