Nirmal: మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని యువత రాణించాలి!

Nirmal: నిర్మల్ ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం. మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని క్రీడల అధికారి పిలుపు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 29 Aug 2026 1:58 PM IST
Nirmal
X

Nirmal: మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని యువత రాణించాలి!

Nirmal: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి వేడుకలను నిర్మల్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ భవేష్ మిశ్రా ఆదేశాలతో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా హాకీ అసోసియేషన్‌ సహ ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ భారత హాకీకి ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చేసిన కృషి, ఆయన ప్రతిభ, అంకితభావం చిరస్మరణీయమని అన్నారు.

ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం కావాలని సూచించారు.

క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు క్రీడా కోటా ద్వారా ప్రభుత్వంతో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

యువత తమ ప్రతిభను గుర్తించి క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రాథోడ్‌ లక్ష్మణ్, జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాకాల రాంచందర్, పీడీలు రమణారావు, రవీందర్‌గౌడ్, అన్నపూర్ణ, భూమన్న, సత్తయ్య, బుచ్చిరామారావు, సుధార్‌సింగ్, పోశెట్టి, వంశీ, కె. శ్రీనివాస్, పీఈటీలు సంజీవ్, గంగాధర్, ముకేష్, భీమేశ్, గిరి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story