Nakkalavada: నక్కలవాడ వాగు ఉధృతి.. 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు!

Nakkalavada: బోథ్ మండలంలో నక్కలవాడ వాగు ఉధృతికి 4 గ్రామాలకు రాకపోకలు బంద్! లో-లెవల్ వంతెన నీటమునగడంతో స్థానికుల ఇబ్బందులు.. హైలెవల్ బ్రిడ్జి కట్టాలని వినతి!

NAGULA SATISH, BOATH
Published on: 30 July 2026 10:33 AM IST
Nakkalavada
X

Nakkalavada: నక్కలవాడ వాగు ఉధృతి.. 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు!

ఉప్పొంగి ప్రవహిస్తున్న నక్కల వాడ వాగు... 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

బోథ్:

​గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బోథ్ మండలంలోని నక్కలవాడ వాగు ఉప్పొంగి తీవ్ర ఉధృతితో ప్రవహిస్తోంది. దీనివల్ల నక్కలవాడ లో-లెవల్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ వరద ప్రవాహంతో నక్కలవాడ గ్రామ పంచాయతీతో పాటు సమీపంలోని లక్ష్మీపూర్, కొత్తపల్లి, రెండ్లపల్లి గ్రామ ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​ప్రతి ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఈ నాలుగు గ్రామాల ప్రజలకు రవాణా నిలిచిపోయి నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు, నిత్యవసర వస్తువుల సేకరణ కోసం అటువైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడున్న లో-లెవల్ బ్రిడ్జి స్థానంలో 'హైలెవల్ బ్రిడ్జి'ని నిర్మిస్తేనే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానిక గ్రామస్తులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story