Nirmal: దస్తురాబాద్ కడెంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్, కడెం మండలాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టల వద్ద మహిళలు పాలు పోసి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

RAKESH N, KHANAPUR
Published on: 17 Aug 2026 12:47 PM IST
Nirmal
X

Nirmal: దస్తురాబాద్ కడెంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ కడెం మండలాల్లో శ్రావణమాసం నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల సమీపంలోని నాగుపాము పుట్టల వద్ద కు తెల్లవారు జాము నుండి కుటుంబ సమేతంగా మహిళలు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు.

నాగుల పంచమి సందర్బంగా పసుపు కుంకుమ పూలు,జొన్న పాలాలు తమ వెంట తెచ్చుకొని, నైవేద్యాలు నాగ దేవతకు సమర్పించి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించారు.తమ కుటుంబం అంత ఆయురారోగ్యాలతో శుభిక్షంగా ఉండాలని నాగ దేవత కు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story