Adilabad: ఆదిలాబాద్‌లో వైల్డ్ లైఫ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్
Adilabad: ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష.
Adilabad: ఆదిలాబాద్‌లో వైల్డ్ లైఫ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్
Adilabad: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, ఆదిలాబాద్ జిల్లాలో పచ్చదనం పెంపుకు కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనుష తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. జిల్లాలోని అటవీ అందాలు, అత్యంత అరుదుగా కనిపించే పక్షులు, ప్రకృతి రమణీయతను పంచె చిత్రాలను లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధించగా వాటిని తిలకించి ఆయనను అభినందించారు. వివిధ పాటశాలల విద్యార్థులు సైతం ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో సామజిక కార్యకర్త బండారి దేవన్న, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.




