Ichoda: ముఖరా (కె)లో కళ్లకు నల్లపట్టీలతో మహిళల వినూత్న నిరసన!
Ichoda: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కె) గ్రామంలో కళ్లకు నల్లపట్టీలతో మహిళల వినూత్న నిరసన.
Ichoda: ముఖరా (కె)లో కళ్లకు నల్లపట్టీలతో మహిళల వినూత్న నిరసన!
Ichoda: ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామ మహిళలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, జుట్టు పట్టుకుని లాక్కెళ్లడం, టీ-షర్టులు ధరించారనే నెపంతో ప్రజాప్రతినిధులను సభలోకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
ఈ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ మహిళలంతా కళ్లకు నల్లపట్టీలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై శాసనసభలో ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఆగమైందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులపై జరిగిన దాడికి ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు ఇందుబాయి, శారద, సునీత, అనూష, అర్చనతో పాటు పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




