Ichoda: కేసీఆర్ వస్తేనే పింఛన్ ముఖరా (కె) వృద్ధుల వినూత్న నిరసన!
Ichoda: జాతీయ వృద్ధుల దినోత్సవాన ముఖరా (కె) గ్రామంలో ఆసరా పింఛన్లకై వృద్ధుల ఆవేదన. కాంగ్రెస్ హామీ నెరవేర్చలేదని కేసీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి నిరసన.
Ichoda: కేసీఆర్ వస్తేనే పింఛన్ ముఖరా (కె) వృద్ధుల వినూత్న నిరసన!
Ichoda: జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కె) గ్రామంలో వృద్ధులు వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పింఛన్ మొత్తాన్ని ₹2,000కు పెంచి, అర్హులైన ప్రతి ఒక్కరినీ పెద్ద మనసుతో ఆదుకున్నారని వారు గుర్తుచేసుకున్నారు. ఆ కృతజ్ఞతతో కేసీఆర్ చిత్రపటానికి దండాలు పెట్టి నివాళులర్పించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛను మొత్తాన్ని ₹4,000కు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఆ హామీని నెరవేర్చకుండా తమను మోసం చేసిందని వృద్ధులు మండిపడ్డారు. కొత్త పింఛన్ దరఖాస్తులకు కూడా అవకాశం కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై నిర్లక్ష్యం వహిస్తోందని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని, ఆసరా పింఛన్ సక్రమంగా అందుతుందని గ్రామ వృద్ధులు ఆవేదనతో స్పష్టం చేశారు.




