Nirmal: సదర్మట్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని చారిత్రాత్మక సదర్ మాట్ ఆయకట్టు నుంచి వానాకాల పంటల సాగు కోసం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ నీటిని విడుదల చేశారు.
Nirmal: సదర్మట్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
సదర్మట్ ఆయకట్టుకు నీటినీ విడుదల చేసిన ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా: ఖానాపూర్ నియోజకవర్గ రైతాంగానికి తీపి కబురు అందింది. మండల పరిధిలోని చారిత్రాత్మక సదర్ మాట్ ఆయకట్టు నుంచి వానాకాల పంటల సాగు కోసం అధికారులు నీటిని విడుదల చేశారు. స్థానిక శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. సకాలంలో సాగునీరు అందడంతో ఆయకట్టు పరిధిలోని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సదర్ మాట్ ఆయకట్టు కాలువలకు సాగునీటి విడుదల ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుత వానాకాల సీజన్‌లో పంటలు ఎండిపోకుండా, రైతులకు సకాలంలో నీరు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సదర్ మాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలువలకు నీటిని విడుదల చేశారు.సదర్ మాట్ ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో రైతులు వరి మరియు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. చివరి ఆయకట్టు భూములకు కూడా నీరు అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నీటిని వృథా చేయకుండా, రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు అధికారులు కోరారు.




