Nirmal: బైంసా మండలంలో కొరడి గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Nirmal: బైంసా మండలం మాటేగాం కొరడి గణనాథుని ఆలయంలో వినాయక చవితి పూజల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 14 Sept 2026 4:19 PM IST
Nirmal
X

Nirmal: బైంసా మండలంలో కొరడి గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Nirmal: నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగాం గ్రామంలో కొలువైన కొరడి గణనాథుని ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య గణనాథుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. గంటకు పైగా ఆలయంలోనే ఉండి ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ - నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలు తొలగించి ప్రతి ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పాలని కొరడి గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa