Penchikalpet: పెంచికల్పేట్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలన!

Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు.

SRINIVAS, KOUTALA
Published on: 20 Aug 2026 2:55 PM IST
Penchikalpet
X

Penchikalpet: పెంచికల్పేట్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలన!

Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరోసారి బొంబాయి గూడ గ్రామ సమీపంలో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థల పరిశీలన చేశారు.

సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ, అందుబాటులో ఉన్న స్థలం, రహదారి సౌకర్యం, విద్యార్థులకు అనుకూలత తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక పాఠశాల అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం త్వరితగతిన ప్రారంభమై విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story