Chintalamanepalli: లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Chintalamanepalli: చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా రైతు వేదికలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు.

LALITH KUMAR, SIRPUR
Published on: 15 May 2026 5:59 PM IST
Chintalamanepalli
X

Chintalamanepalli: లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

చింతలమానేపల్లి: కొమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా రైతు వేదికలో 43 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను, నలుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులు మరియు ఆరుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలోపు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులందరూ బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని, లేని పక్షంలో వారి మంజూరు పత్రాలను రద్దు చేసి వేరే వారికి ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ప్రజలు మరియు లబ్ధిదారులు సహకరించాలని కోరారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story