Adilabad: ఆదిలాబాద్‌లో వైభవంగా అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపనలు!
Adilabad: ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్, ధోబికాలనీల్లో పోచమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరిగాయి.
Adilabad: ఆదిలాబాద్‌లో వైభవంగా అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపనలు!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ లోని భుక్తాపూర్ లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, ధోబికాలనీలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు..వేద పండితుల మంత్రోచ్ఛాల నడుమ పూజాది కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అమ్మవారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు.
Next Story




