Gudihathnoor: రూ. 18 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే!
Gudihathnoor: గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో రూ. 18 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ.
Gudihathnoor: రూ. 18 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే!
Gudihathnoor: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామాన్ని విడతల వారీగా అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. గురువారం కొల్హారి గ్రామంలో రూ. 18 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, భూమిపూజ నిర్వహించి పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామస్తులందరూ ఐక్యతతో కలిసికట్టుగా ఉంటూ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు అన్ని సౌకర్యాలు కల్పించడమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ తిరుమల్ గౌడ్, PACS చైర్మన్ సంజీవ్ ముండే, గజానంద్, ప్రతాప్ మరియు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.




