Gudihatnoor: కాంగ్రెస్ వైఫల్యాలపై గుడిహత్నూర్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బైక్ ర్యాలీ!
Gudihatnoor: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో గుడిహత్నూర్లో బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజం.
Gudihatnoor: కాంగ్రెస్ వైఫల్యాలపై గుడిహత్నూర్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బైక్ ర్యాలీ!
Gudihatnoor: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ గుడిహత్నూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో పార్టీ శ్రేణులు, రైతులు భారీ ఎత్తున కదిలివచ్చారు.
డోంగ్రాగావ్ ఈద్గా సమీపంలోని ఎన్హెచ్-44 వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గుడిహత్నూర్ క్రాస్ రోడ్ వరకు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. సుమారు 100 మోటార్ సైకిళ్లతో, 300 మందికి పైగా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వేల రోజుల పాలన సాగిస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు, సామాన్య ప్రజలను మోసం చేస్తూ మోసపూరిత విధానాలు అవలంబిస్తోందని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుమల్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్ ముండే, సీనియర్ నాయకులు పవార్ రవి నాయక్, భీం రావు నాయక్, ప్రశాంత్ మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




