Neradigonda: సబ్సిడీ పత్తి విత్తనాల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Neradigonda: నెరడిగొండ రైతువేదికలో పత్తి విత్తనాల పంపిణీ. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా రైతులకు 192 సబ్సిడీ పత్తి విత్తనాల బ్యాగుల అందజేత.

NAGULA SATISH, BOATH
Published on: 3 July 2026 12:06 PM IST
Neradigonda
X

Neradigonda: సబ్సిడీ పత్తి విత్తనాల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నెరడిగొండ: నెరడిగొండ మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై, రైతులకు 192 పత్తి విత్తనాల బ్యాగులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఈ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, ఏఈవోలతో పాటు సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, మాజీ పిఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మండల కన్వీనర్ శివారెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, సాబ్లే సంతోష్, సుజీల్, శ్రీకాంత్ రెడ్డి, రాథోడ్ సురేందర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story