Boath: కళ్యాణలక్ష్మి నిధులు విడుదల చేసి తులం బంగారం ఇవ్వాలి!
Boath: ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ధర్నా. కళ్యాణలక్ష్మి నిధులు తక్షణమే విడుదల చేయాలని, తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్.
Boath: కళ్యాణలక్ష్మి నిధులు విడుదల చేసి తులం బంగారం ఇవ్వాలి!
Boath: కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో మేనమామలా అండగా నిలిచి 15 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ద్వారా ₹1,00,116 ఆర్థిక సహాయం అందించారని, కేసీఆర్ కిట్, రైతుబీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు.
కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేయడమే కాకుండా, ఉన్న పథకాన్ని కూడా నిలిపివేసి లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో సరైన కౌంటర్ దాఖలు చేయకుండా పేదల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు నిధులు విడుదల చేయాలని, తులం బంగారంపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.




