Nirmal: కడెం మండలంలో విషాదం: అదృశ్యమైన వృద్ధ రైతు శవమై లభ్యం!

Nirmal: కడెం మండలం నవపేట్ గ్రామంలో పశువులు మేపడానికి వెళ్లి అదృశ్యమైన వృద్ధ రైతు సిందం గంగన్న శవమై లభ్యం. వాగు సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన కూలీలు, పోలీసులు.

RAKESH N, KHANAPUR
Published on: 22 Aug 2026 11:43 AM IST
Nirmal
X

Nirmal: కడెం మండలంలో విషాదం: అదృశ్యమైన వృద్ధ రైతు శవమై లభ్యం!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం నవపేట్ గ్రామానికి చెందిన సిందం గంగన్న(70) గత నెల 30 తారీఖున పశువులను మేపడానికి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడు. సాయంత్రం పశువులు ఇంటికి వచ్చి, గంగన్న రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కడెం పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగా ఎస్సై సాయి కిరణ్ ఆధ్వర్యంలో 20 మంది పోలీసులు మూడు రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టగ ఎటువంటి ఆచూకి లభించలేదు.

ఈ రోజు ఆగస్టు 22 న అంబర్పేట్ గ్రామానికి చెందిన కూలీలు అంబారిపేట శివారు ప్రాంతంలో ఉన్న వాగు వైపున ఉపాధి హామీ పనుల కోసం వాగు సమీపంలోకి వెళ్లగా మృతదేహం చూసి స్థానిక పోలీసులకి సమాచారం అందించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story