Adilabad: ఎండవేడికి తట్టుకోలేక చేపల మృతి!

Adilabad: తీవ్రమైన ఎండవేడికి ఊపిరాడక లక్షలాది రూపాయల విలువైన చేపలు మృతి. తీవ్ర ఆవేదనలో స్థానిక గంగపుత్రులు, రంగంలోకి దిగిన మత్స్య శాఖ అధికారులు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 2 Jun 2026 3:05 PM IST
Adilabad
X

Adilabad: ఎండవేడికి తట్టుకోలేక చేపల మృతి!

ఆదిలాబాద్: మావల చెరువులో భారి సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఎండవేడిమికి తట్టుకోలేక నీటిలో ఆక్సిజన్ తక్కువై చేపలు మృతి చెందినట్లు మత్స్య శాఖ అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ద్వార చేప పిల్లలు చెరువులో వదలగా.... వాటి నిర్వహణను స్థానిక గంగపుత్రులు పర్యవేక్షిస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం చెరువు వద్దకు వచ్చి చూడగా.... చెరువు నిండా చనిపోయిన చేపలు కనిపించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిదు కిలోల నుండి మూడు కిలోల వరకు ఉన్న దాదాపు రూ.5 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు గంగపుత్రులు తెలిపారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story