Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు!
Adilabad: ఆదిలాబాద్ బెల్లూరి అయ్యప్ప ఆలయంలో 275 మంది భక్తుల సామూహిక సత్యనారాయణ వ్రతాలు. హాజరైన సివిల్ జడ్జి భూక్య హుస్సేన్.
Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు!
Adilabad: అదిలాబాద్ పట్టణంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో 275 మంది భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలను వైభవంగా నిర్వహించుకున్నారు.. అదిలాబాద్ పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాల చెందిన 275 మంది భక్తులు ఇటీవలే సామూహిక శబరిమల యాత్ర విజయవంతంగా ముగించుకుని తిరిగి రాగా 270 మంది పైగా భక్తులు కుటుంబ సమేతంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి భూక్య హుస్సేన్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు, యాత్ర నిర్వాహకులు చందా గణేష్, మాజీ అధ్యక్షుడు కుంబోది సూర్యకాంత్, గౌరవ లక్ష్మణ్, సత్యం, అక్షయ్, భగవాన్లు, తోట సంతోష్, శ్రీనివాస్ తదితర గురు స్వాములు పాల్గొన్నారు.
Next Story




