Bazarhatnoor: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కాలుజారి చెరువులో మునిగి మృతి!

Bazarhatnoor: బజార్‌హత్నూర్ మండలం కొలరి లో చౌరే అరుణ్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి చనిపోగా, బోథ్ సీఐ గురుస్వామి కేసు నమోదు చేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 25 July 2026 7:22 PM IST
Bazarhatnoor
X

Bazarhatnoor: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కాలుజారి చెరువులో మునిగి మృతి!

​బజార్ హత్నూర్: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన బజార్ హత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొలరీ గ్రామానికి చెందిన చౌరే అరుణ్ (48) శుక్రవారం సాయంత్రం చేపల వేట కోసం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. చేపలు వేటాడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయి గల్లంతయాడు.

​సమాచారం అందుకున్న బోథ్ సీఐ గురుస్వామి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చీకటి పడటంతో గాలింపు నిలిపివేశారు. అనంతరం శనివారం ఉదయం గజఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించగా అరుణ్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కొలరీ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story