Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం వీధి కుక్కల దాడిలో వృద్ధుడు మృతి
Mancherial: మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వీధి కుక్కలు దాడి చేసి 80 ఏళ్ల వృద్ధుడు ఓరగంటి పోషంను పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం వీధి కుక్కల దాడిలో వృద్ధుడు మృతి
Mancherial: దండేపల్లి, వీధి కుక్కల దాడిలో 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన విషాద ఘటన దండేపల్లి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఓరగంటి పోషం (80) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి పోషంపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో పోషం అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో దండేపల్లి మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీధి కుక్కల సంచారం రోజురోజుకూ పెరుగుతోందని, వాటి బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.




