Mancherial: మోదీ పుట్టినరోజు వేళ బీజేపీ భారీ ప్లాన్.. నెల రోజుల పాటు!

Mancherial: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా హీ సంఘటన్’ కార్యక్రమాలు విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 10 Sept 2026 8:06 PM IST
Mancherial
X

Mancherial: మోదీ పుట్టినరోజు వేళ బీజేపీ భారీ ప్లాన్.. నెల రోజుల పాటు!

మంచిర్యాల జిల్లా: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల పాటు సేవలందించిన సందర్భంగా ఆయన జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న సేవా హీ సంఘటన్ కార్యక్రమాలను ప్రతి బూత్ స్థాయిలో విజయవంతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కోరారు.

మంచిర్యాల జిల్లా భాజపా కార్యాలయంలో కార్యక్రమ కన్వీనర్ పట్టి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్‌కు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ అందిస్తున్న అభివృద్ధి, సేవలు ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నాయని అన్నారు. మోదీ 25 సంవత్సరాల సేవా అంకితభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జాతీయ పార్టీ సూచించిన 9 కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి బూత్ స్థాయిలో ‘ఆశీస్సుల దీపం’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లలో నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఆశీస్సుల దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.

అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తల సన్మాన కార్యక్రమాలను మండల, జిల్లా స్థాయిలో నిర్వహించాలని సూచించారు. ‘కోటి పిల్లల కలలు’, ‘మార్పు కథ’, ‘నమో సేవా గాథ’, రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులను పెద్ద ఎత్తున నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గమ్మ అశోక్, మీడియా ప్యానెల్ ఇంచార్జి తుల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ రావు, కార్యదర్శులు రాచర్ల సంతోష్, వైద్య శ్రీధర్, జిల్లా కార్యక్రమ కన్వీనర్లు, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, ఏతం శివకృష్ణ, శిరీష, మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్న రాణి, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story