Gudihathnoor: పోస్టల్ ఉద్యోగం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్!

Gudihathnoor: పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1 లక్ష మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన గుడిహత్నూర్ పోలీసులు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి వెల్లడి.

NAGULA SATISH, BOATH
Published on: 19 Aug 2026 5:49 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: పోస్టల్ ఉద్యోగం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్!

Gudihathnoor: పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1 లక్ష తీసుకొని మోసగించిన వ్యక్తిని గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన బాధితుడు భూరే స్వప్నిల్ వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన ఫడ్ రాజు అనే వ్యక్తి ఉద్యోగం ఆశచూపి బ్యాంక్ ద్వారా నగదు తీసుకుని మోసం చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట దళారులను నమ్మి మోసపోవద్దని, అధికారిక నియామక ప్రక్రియలను మాత్రమే అనుసరించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story