Nirmal: గాజులపేట కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా మహా రుద్రాభిషేకం, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు.
Nirmal: గాజులపేట కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేటలో గల కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణమాసం పౌర్ణమి పురస్కరించుకొని మహా రుద్రాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని పల్లకి సేవను నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ దేవరకోట చైర్మన్ ఆమెడ శ్రీధర్, ఆలయ కమిటీ చైర్మన్ లింగన్న, దార్ల రాజేశ్వర్, పూర్ణేందర్, పడిగెల శివ ,అయ్యన్న గారి శ్రీనివాస్, రవి, లక్ష్మణ్ , పోశెట్టి, వార్డు సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




