Kuntala: ఉగ్రరూపం దాల్చిన కుంటాల జలపాతం.. పర్యాటకుల ప్రవేశం నిషేధం!
Kuntala: భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న ఆదిలాబాద్ కుంటాల జలపాతం. పర్యాటకుల భద్రత దృష్ట్యా సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసిన అటవీ శాఖ.
Kuntala: ఉగ్రరూపం దాల్చిన కుంటాల జలపాతం.. పర్యాటకుల ప్రవేశం నిషేధం!
ఉధృతంగా ప్రవహిస్తున్న కుంటాల జలపాతం: పర్యాటకుల సందర్శనపై తాత్కాలిక నిషేధం
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోనీ 'తెలంగాణ నయాగరా' కుంటాల జలపాతం, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండుగా జలకళను సంతరించుకుని ఉధృతంగా పరవళ్ళు తొక్కుతోంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుండటంతో అక్కడ సందడి నెలకొంది.
అయితే, జలపాతం నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోపలికి అనుమతించకుండా తాత్కాలికంగా పర్యాటకుల సందర్శనను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. సందర్శకులు పరిస్థితిని గమనించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story




