Boath: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్.. రైతు పరామర్శ, పార్టీ కీలక మీటింగ్!

Boath: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

NAGULA SATISH, BOATH
Published on: 20 Jun 2026 10:37 AM IST
Boath
X

Boath: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్.. రైతు పరామర్శ, పార్టీ కీలక మీటింగ్!

​బోథ్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సిరికొండ మండలం పొన్న గ్రామంలోని చెందిన జొన్న రైతు పాండురంగ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పార్టీ స్థానిక నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

​షెడ్యూల్ ప్రకారం, కేటీఆర్ ముందుగా 10.30 గం,,లకు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చేరుకునీ. బోథ్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ నివాసానికి వెళ్తారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో కాసేపు గడిపిన అనంతరం, అక్కడి నుండి రోడ్డు మార్గాన సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి బయలుదేరి వెళ్లనున్నారు.

​పొన్న గ్రామంలో ఇటీవల జొన్న కొనుగోలు కేంద్రంలో జరిగిన ఆలస్యం, ఎదురైన ఇబ్బందులను తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన జొన్న రైతు పాండురంగ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శిస్తారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి బీఆర్‌ఎస్ పార్టీ తరపున పూర్తి భరోసా కల్పించనున్నారు. రైతు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకానున్నారు.

అనంతరం మధ్యాహ్నం 1 గం,, లకు కేటీఆర్ తిరిగి నేరడిగొండ మండలానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఒక ఫంక్షన్ హాల్లో బోథ్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. రాబోయే రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఈ సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని జిల్లా బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story