Khanapur: ఖానాపూర్‌లో వినూత్నంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు!

Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లెలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు వినూత్నంగా జరిగాయి.

RAKESH N, KHANAPUR
Published on: 24 July 2026 4:48 PM IST
Khanapur
X

Khanapur: ఖానాపూర్‌లో వినూత్నంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు!

Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఖానాపూర్ మండలం లోనీ గోసంపల్లె గ్రామ సర్పంచ్ కొక్కుల సుభద్ర ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు.

గోసంపల్లె గ్రామంలోని వ్యవసాయ పొలంలో పచ్చని వరి నాట్లతో ఆంగ్ల అక్షరాలలో "KTR" అనే పేరు వచ్చేలా ప్రత్యేకంగా వరి నాట్లు వేసి కేటీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

రైతుల పక్షాన కేటీఆర్ చేస్తున్న నిరంతర పోరాటాలకు గుర్తుగా, రైతు సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న కృషికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు సర్పంచ్ శ్రీమతి కొక్కుల సుభద్ర తెలిపారు.

"రైతు గుండెల్లో కేటీఆర్.. పచ్చని పొలంలో 'KTR అంటూ గ్రామస్థులు కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story