Khanapur: ఖానాపూర్‌లో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' విద్యార్థుల ర్యాలీ

Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. హాజరైన జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, చైర్ పర్సన్ అంకం మౌనిక.

RAKESH N, KHANAPUR
Published on: 12 Aug 2026 9:24 PM IST
Khanapur
X

Khanapur: ఖానాపూర్‌లో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' విద్యార్థుల ర్యాలీ

ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి తెలంగాణ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ఆదేశాలతో భాజపా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాల ల విద్యార్థినీ, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి దేశభక్తి ని చాటారు.

చేతిలో జాతీయ జెండా... గుండెల్లో దేశభక్తి... నినాదాలతో మార్మోగిన ఖానాపూర్ పట్టణం. భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీలో పాల్గొని భారతమాతకు జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల క్రమశిక్షణతో కూడిన ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. చిన్నారుల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి స్ఫూర్తిని నింపుతూ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ మాట్లాడుతూ .. దేశ ప్రధాని నరేద్ర మోడీ ఆదేశాలతో హార్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు..

జాతీయ జెండా మన దేశ గౌరవానికి ప్రతీక అని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story