Nirmal: బురద పొలంలో వరి నాట్లు వేసిన నిర్మల్ కేజీబీవీ విద్యార్థినులు!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ కేజీబీవీ విద్యార్థినులకు వ్యవసాయంపై ప్రత్యక్ష అవగాహన. వరి పొలాల్లో నాట్లు వేసి సేంద్రియ సాగు ప్రాముఖ్యత తెలుసుకున్న బాలికలు.

RAKESH N, KHANAPUR
Published on: 18 Aug 2026 11:54 AM IST
Nirmal
X

Nirmal: బురద పొలంలో వరి నాట్లు వేసిన నిర్మల్ కేజీబీవీ విద్యార్థినులు!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో విద్యార్థులకు వ్యవసాయంపై సరికొత్త అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో అన్నం పెట్టే రైతన్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు కేజీబీవీ (KGBV) పాఠశాల ఒక వినూత్న అడుగు వేసింది.

దస్తురాబాద్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) స్పెషల్ ఆఫీసర్ (S.O) తిరుమల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినులను సమీపంలోని వరి పొలాల్లోకి తీసుకెళ్లారు.

నిత్యం తరగతి గదుల్లో చదువుకునే విద్యార్థినులు, నేడు బురద పాయల్లోకి దిగి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. పొలంలో పనులు ఏ విధంగా సాగుతాయి, రైతులు పడే కష్టం ఎలాంటిదో ఉపాధ్యాయులు వారికి ప్రాక్టికల్‌గా వివరించారు.

ముఖ్యంగా, రాబోయే రోజుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని విద్యార్థినులకు తెలియజేశారు.

మనం తినే ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉందన్న నినాదంతో విషపూరితం కాని, పోషకాలతో కూడిన ఆహారాన్ని పండించడం ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు స్థానిక రైతులు పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story