Kagaznagar: కాగజ్‌నగర్‌లో ఘనంగా అటవీ అమరవీరుల దినోత్సవం!
Kagaznagar: కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో అటవీ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ, రక్తదాన శిబిరం నిర్వహించి అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
Kagaznagar: కాగజ్‌నగర్‌లో ఘనంగా అటవీ అమరవీరుల దినోత్సవం!
Kagaznagar: కొమురం భీం జిల్లా: కాగజ్‌నగర్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో తెలంగాణ అటవీ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో పాటు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఎఫ్‌డీఓ టి. భార్గవ్ కుమార్, ఐఎఫ్‌ఎస్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు సిబ్బంది రక్తదానం చేశారు.
కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని వివిధ ఫారెస్ట్ రేంజ్‌లకు చెందిన అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అటవీ సంరక్షణ కోసం అమరులైన వారి సేవలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు.




